Nenu - Na Kavitvalu
3, జూన్ 2016, శుక్రవారం
6, అక్టోబర్ 2014, సోమవారం
లేవంటే లేవంతే....
రోజాలు తురమాల్సిన నీ తలపై శిరోజాలు లేవు,
సుమాలు విరిసే నీ దరహాసంలో దంతాలు లేవు,
మెల్లగా జాలువారు వెన్నెల జలపాతాలు నీ మేల్లకన్నులో లేవు,
సిగ్గుతో విచ్చుకునే నీ పరువాలు ఆ బొగ్గులో లేవు,
నిన్ను తేరి చూసుకొని సరి పోల్చుకునే ఏ పశుపక్షాదులు లేవు,
నిన్ను చూసి భరించే అతీంద్రియ శక్తులు నా కళ్ళకు లేవు.
- ప్రవీణ్ కుమార్ నేత
రోజాలు తురమాల్సిన నీ తలపై శిరోజాలు లేవు,
సుమాలు విరిసే నీ దరహాసంలో దంతాలు లేవు,
మెల్లగా జాలువారు వెన్నెల జలపాతాలు నీ మేల్లకన్నులో లేవు,
సిగ్గుతో విచ్చుకునే నీ పరువాలు ఆ బొగ్గులో లేవు,
నిన్ను తేరి చూసుకొని సరి పోల్చుకునే ఏ పశుపక్షాదులు లేవు,
నిన్ను చూసి భరించే అతీంద్రియ శక్తులు నా కళ్ళకు లేవు.
- ప్రవీణ్ కుమార్ నేత
5, అక్టోబర్ 2014, ఆదివారం
ఏకలింగం - ఎలక్ట్రిక్ లవ్
- ప్రవీణ్ కుమార్ నేత.
చెలి.....
చెలి.....
ఎలక్ట్రిక్ పోలుకు వేలాడే కరంటు తీగాల్లాంటి నీ కురులు....
20 వాట్స్ బెడ్ లాంప్ లాంటి నీ కళ్ళు,
తిరగేసిన త్రిపిన్ సాకెట్ లాంటి నీ ముక్కు,
స్టీరియో లౌడ్ స్పీకర్ లాంటి నీ మూతి,
5HP మోటారు లాంటి నీ తల,
ట్రాన్స్ఫార్మర్ లాంటి ఒళ్ళు,
బాటరీ లాంటి నా గుండెకి ఛార్జింగ్ నింపాయి...
నువ్వు పక్కన ఉంటె ఎడారి ఎండలో ఉన్న A/C లో ఉన్నట్టే...
నువ్వు గాని లేకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్నా ఎలక్ట్రిక్ హీటర్ మీద కూర్చున్నట్టే...
ఆన్ చేసి ఉంచిన ఉషా సీలింగ్ ఫ్యాన్ లా నా మనసెప్పుడు నీ చుట్టే గిరా గిరా తిరుగుతోంది...
అరగంట క్రితం ఆన్ చేసిన ఇస్త్రీ పెట్టెలా ఒళ్ళు కాలుతోంది...
రాగి తీగాల్లాంటి నీ ఊహలు నా మనసును వైన్డింగ్ చేసాయి...
నువ్వు కాన రాగానే ఆన్ చేసిన కలర్ టీవీ లా వెలిగిపోయే నా మొహం..
నీ జాడ లేక ఆఫ్ చేసిన బ్లాకు అండ్ వైట్ టీవీ లా వెల వెలబోతోంది ..
లో voltage కె లొంగి పోయే నాకు, హై voltage తగిలించావ్,
మాడిపోయిన ఎలక్ట్రిక్ బుల్బ్ లా నన్ను మిగిల్చావ్....
ఇక చాలు చెలి... ఇక నైన నా ప్రేమ ను అంగీకరించు...
లేదంటే...
నేను ఎలక్ట్రిక్ హీటర్ మీద కూర్చుని,
నా తలను మిక్సీ లో పెట్టి,
వేళ్ళు ప్లగ్ లోనూ, కాళ్ళు గ్రిజర్ లోనూ పెట్టి నిన్నే పవర్ ఆన్ చేయమంటా...
ఫిలమెంట్ నా ప్రాణాన్ని నువ్వే నిలపాలి ప్రియా ...
నీ పిలుపు కోసం ఎదను NTPC లా అలంకరించుకొని ఎదురుచూస్తూ ఉంటా..
ఇట్లు
ఎలక్ట్రీషియన్ ఏకలింగం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
